మహిళను లాక్కెళ్లి గ్యాంగ్ రేప్.

లాక్‌డౌన్ కారణంగా కాలినడకన సొంతూరికి బయల్దేరిన మహిళ గ్యాంగ్‌రేప్‌‌కి గురైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జైపూర్‌కి చెందిన మహిళ(40) లాక్‌డౌన్‌కి ముందు సవాయ్ మధోపూర్ జిల్లాకు వెళ్లింది. సడెన్‌గా లాక్‌డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకుపోయింది. అక్కడే సుమారు నెలరోజులపాటు గడిపిన మహిళ ఎలాగైనా ఇంటికి వెళ్లాలని కాలినడకన జైపూర్ బయల్దేరింది.రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తుండగా చీకటిపడడంతో రహదారి పక్కనే ఉన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విశ్రాంతి తీసుకునేందుకు ఆగింది. మహిళ ఒంటరిగా కనిపించడంతో కామాంధుల కన్ను ఆమెపై పడింది. మహిళను తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.