⍟ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య మిలియన్‌కు చేరువలో ఉండగా.. దాదాపు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడతున్నాయి. అయితే, ఉత్తర కొరియా మాత్రం దీనికి భిన్నంగా తమ దేశంలో వైరస్‌ను పూర్తిగా నిర్మూలించామని గురువారం ప్రకటించింది. దీంతో దేశంలో వైరస్‌ను ఉత్తర కొరియా ఎలా నియంత్రించిందనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది . పూర్తి కథనం..
⍟ దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండగా.. బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు కూడా ఈ మహమ్మారి బారినపడుతున్నారు. కరోనాకు చికిత్స చేస్తున్న వైద్యుల్లో ఇప్పటి వరకూ ఏడుగురికి కోవిడ్-19 సోకింది. తాజాగా, న్యూఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్‌కు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అయితే, కొన్ని చోట్ల వైద్యులపై దాడులు చోటుచేసుకోవడం బాధాకరం.
⍟ కరోనా వైరస్ మహమ్మారి వేలాది మంది బలవుతున్నారు. కొవిడ్-19తో పోరాడేందుకు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవటం ముఖ్యమని ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించింది. వేడి నీళ్లు తాగాలని, ప్రాణాయామం, 30 నిమిషాలపాటు ధ్యానం చేయాలని, అలాగే ఆహారంలో జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి విరివిగా వాడాలని పేర్కొంది. ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్-19కు మందు లేదు. నివారణ కంటే నిరోధకత మంచిదని మనందరికీ తెలుసు. కాబట్టి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోటోకాల్స్‌ను పాటించండి’ అనిమోదీ ట్విట్ చేశారు