Today Astrology: ఏప్రిల్ 2 రాశి ఫలాలు- ఓ రాశివారికి ఆస్తి వివాదాలు తీరుతాయి!

పురాతన కాలం నుంచి భారతీయులకు జ్యోతిషంపై అపారమైన నమ్మకం. దీనిని వేదాలలో ఓ భాగంగానే నాటి భారతీయ పండితులు పరిగణించారు. జ్యోతిషం ఆధారంగా భూత, భవిష్యత్తు, వర్తమానం గురించి తెలుసుకుంటారు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారం, శరీరక లక్షణాలు, అర చేతులు మొదలైన వివిధ అంశాలను ఆధారం చేసుకొని జ్యోతిషం వివరిస్తుంది. ఆరు వేదాంగాలలో జ్యోతిష్యం ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో జ్యోతిషానిది తొలిస్థానం. మొట్టమొదటిసారిగా జ్యోతిష్య శాస్త్రాన్ని వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది.సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంతో ఊరట చెందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతరుల విషయాలకు, వివాదాలకూ దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.