కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొన్వల్‌సెంట్ ప్లాస్మా థెరపీని చాలా దేశాల్లో వాడుతున్నారు. చివరిదశలో ఉన్న కరోనా రోగులపై ఈ థెరపీని ప్రయోగించగా.. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈక్రమంలో మనదేశంలో ఇప్పటికే ఈ థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. ఈక్రమంలో కర్ణాటకలోనూ ప్లాస్మా థెరపీని స్టార్ట్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని కరోనా ఇంచార్జ్ మినిస్టర్, విద్యా శాఖ మంత్రి కే సుధాకర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఈ చికిత్స ద్వారా ఉపశమనం దొరికే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనాకు చెక్.. కర్నాటకలో క్లినికల్ ట్రయల్స్ షురూ